ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయనున్న నాని..!!

0
100

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకెళ్తున్నాడు… ఇప్పటికే వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న నాని త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.. శివ నిర్వాణ దర్శకత్వములో ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు నాని.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి..

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సిన కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడింది.. ఇక ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని.కరోనా కారణంగా చాలా సినిమాలు పేకప్ చెప్పేసుకుని లొకేషన్లు వదిలేసి వెళ్లిపోయాయి. కానీ నాని మాత్రం తన సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండటం విశేషం. అటు కొన్ని రోజులు .. ఇటు కొన్ని రోజులు కేటాయిస్తూ సినిమా షూటింగులు కానిచ్చేస్తున్నాడట.

అయితే తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ .. టీమ్ ను అప్రమత్తం చేస్తున్నాడని అంటున్నారు. నాని ఒప్పుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ అంటే .. సుందరానికీ!’ రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట నాని.. అంతేకాదు ఈ రెండు సినిమాల తర్వాత మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here