Navadeep: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో నవదీప్ గురించి అందరికీ సుపరిచితమే. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవదీప్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

నవదీప్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించి విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న నవదీప్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నవదీప్ కి ఒక నెటిజన్ తన పెళ్లి గురించి సలహా ఇచ్చారు.

దాదాపు 35 సంవత్సరాలు దాటిన నవదీప్ ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఒక నెటిజన్ స్పందిస్తూ.. అన్నా గడ్డం మొత్తం తెల్లబడింది. పెళ్లి చేసుకోకూడదు అంటూ సలహా ఇచ్చాడు. దీంతో నవదీప్ వద్దురా… సోదరా అంటూ ట్విట్టర్ ద్వారా సదరు నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గడ్డం తెల్లబడితే ట్రిమ్మింగ్ చేయాలి…
ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ గడ్డం తెల్లబడితే ట్రిమ్మింగ్ చేయాలి. కానీ పెళ్లి చేసుకోకూడదు. దురద పెడితే గోకుతాము కానీ చర్మం తీసుకోం కదా అంటూ ఇప్పుడే తను పెళ్లి చేసుకోననే ఉద్దేశంతో సదరు నెటిజన్ కి కౌంటర్ ఇస్తున్నటువంటి వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022































