Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో ఉంటూ గత ఏడాది జూన్ 9వ తేదీ తనని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.

ఇలా తల్లిదండ్రులుగా మారిన నయనతార దంపతులు ప్రస్తుతం తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార దంపతులు మొదటిసారి తమకుల దైవం ఆలయానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను చేయించారు. అయితే గుడిలోకి నయనతార దంపతులు వచ్చారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని గోల చేశారు. కనీసం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా గోల చేశారు.

Nayanatara: మేము కూడా పూజ కోసమే వచ్చాము…
ఇలా అభిమానులు గోల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఒక్కసారిగా ఆలయం గేటు వద్దకు వచ్చి అభిమానులపై మండిపడ్డారు.మేము కూడా పూజ కోసమే వచ్చాం ఐదు నిమిషాలు ఆగితే పూజ పూర్తి అవుతుంది కనీసం ఐదు నిమిషాలు ఎదురు చూడలేరా అంటూ అభిమానులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా నయనతార వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా అనంతరం విగ్నేష్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
“5 நிமிஷம் ப்ளீஸ்” – பொதுமக்களிடம் பொறுமையாக இருக்கக் கோரிய நடிகை நயன்தாரா! #Nayanthara | #VigneshShivan | #WikkiNayan pic.twitter.com/lxGftqQVrI
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 5, 2023































