Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

0
297

Nayanathara -Vignesh Wedding :లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ వివాహం జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కోసం మహాబలిపురంలోని ఒక రిసార్ట్ వేదికగా మారింది.ఇలా మహాబలిపురంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని అందరూ భావించారు.

Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?
Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

పెళ్లి కోసం రిసార్ట్స్ ఎంతో అందంగా ముస్తాబు చేశారు. భోజనాల దగ్గర నుంచి అతిథుల గదుల వరకు కూడా అన్ని ఎంతో ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ వివాహానికి కోట్ల రూపాయలు ఖర్చుకావడం సర్వ సాధారణం. అయితే ఈ పెళ్లికి అయిన ఖర్చు మొత్తం నయనతార విగ్నేష్ మాత్రం భరించలేదట. వీరిద్దరూ వీరు పెళ్లి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?
Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

ఇక పెళ్లి కోసం వీరిద్దరూ రూపాయి ఖర్చు చేయకుండా ఇంత ఘనంగా ఎలా పెళ్లి చేసుకున్నారనే విషయానికి వస్తే… వీరి పెళ్లిని ప్రముఖ డిజిటల్ మీడియా నెట్ ఫ్లిక్స్ కి అమ్మిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఖర్చులన్ని కూడా నెట్ ఫ్లిక్స్ భరించి ఉందని తెలుస్తోంది. పెళ్లి కోసం మేకప్ ఆర్టిస్టుల నుంచి సెక్యూరిటీ సిబ్బంది, వచ్చిన అతిథులకు గదులు భోజనాలు వంటి సదుపాయాలు వరకు అన్ని ఖర్చులను నెట్ ఫ్లిక్స్ భరించినట్లు తెలుస్తోంది.

ఖర్చులన్నీ భరించిన నెట్ ఫ్లిక్స్ …

నయనతార పెళ్లి కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక వీరి వివాహాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో చిత్రీకరించారు. ఇలా నయనతార విగ్నేష్ పెళ్లి ఖర్చులను నెట్ ఫ్లిక్స్ భరించడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడ్డారు. ఇకపోతే త్వరలోనే పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.నయనతార విగ్నేష్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ విషయంపై నయనతార దంపతులు స్పందించాల్సి ఉంది.