Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ప్రేమలో విహరిస్తున్న ఈ జంట నేడు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరి వివాహం పూర్తి కావడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే నయనతార వివాహానికి కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఈమె వివాహానికి హాజరయ్యారని తెలుస్తోంది.ఇకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి నయనతార పెళ్లి కానుకగా తన భర్తకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.
ఖరీదైన ఇంటిని కానుకగా..
చెన్నైలో ఎంతో ఖరీదైన ప్రాంతంలో నయనతార తన అభిరుచులకు అనుగుణంగా ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్లపై తన భర్త విగ్నేష్ శివన్ పేరు రాయిస్తూ పెళ్లికి కానుకగా తన భర్తకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఇంటి ఖరీదు దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ విధంగా నయనతార తన భర్తకు ఎంతో ఖరీదైన కానుకను అందించిందని చెప్పాలి.






























