నీనా గుప్తా తెలుగువారికి ఈ పేరు గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ హిందీ సినిమాలను ఫాలో అయ్యే వారికి మాత్రమే ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 80వ దశకంలో ఈమె తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి అదే అందాన్ని కంటిన్యూ చేస్తూ పలు సినిమాల్లో నటిస్తోంది. బదాయి హో,పంగా సర్దార్ కా గ్రాండ్ సన్ ఇలాంటి సినిమాలలో మంచి మంచి పాత్రలో నటిస్తోంది.

సినీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించి ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకున్న నీనా గుప్తా,తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ప్రేమాయణం సాగించిన ఆమె పెళ్లి కాకుండానే గర్భం ధరించి మసాబాకు జన్మించింది. అనంతరం అతనితో విడిపోయిన తరువాత సింగిల్ గానే మసాబాను పోషించింది.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అప్పుడప్పుడు పలు ఆసక్తికర పోస్టును కూడా చేస్తూ ఉంటుంది.తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఒక ఆసక్తికర వీడియోని పోస్ట్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ తెగ వైరల్ అవుతోంది.
మీరు పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే ఎప్పుడూ మస్కారా పెట్టుకోకండి. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతోందా? అసలు నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరు అనుభవిస్తే తప్ప తెలియదు’ అంటూ పరోక్షంగా రిచర్డ్స్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చింది.ఎందుకంటే నీనా రిచర్డ్స్‌తో ప్రేమలో పడే నాటికే అతనికి వివాహమైంది. ఈ పోస్టుపై స్పందిస్తోన్న నెటిజన్లు పెళ్లైన మగాళ్లను ప్రేమిస్తే కన్నీళ్లే మిగులుతాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.































