Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలోమెగా స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మెగా అభిమానులు సైతం కొరటాల పై గుర్రుగా ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి నటనలో ఏ మాత్రం పూర్వవైభవం లేదని అభిమానులు వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలు రామ్ చరణ్ చిన్నప్పుడు పాత్రలో చిరంజీవిని చాలా యంగ్ గా చూపించడం కోసం కొరటాల వి.ఎఫ్.ఎక్స్ ఉపయోగించారు. అయితే ఇక్కడ మాత్రం అసలు చిరంజీవి లుక్ పూర్తిగా మారిపోయింది.

ఈ క్రమంలోనే మెగా అభిమానులు చిరంజీవి లుక్ పై పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు ఈ లుక్ పై స్పందించి వి.ఎఫ్.ఎక్స్ వాడటం వల్ల మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ పోలికలతో కనబడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆచార్య లుక్ పై భారీ ట్రోలింగ్…
ఈ క్రమంలోనే మరికొందరు చిరు కోసం వి.ఎఫ్.ఎక్స్ వాడడం కన్నా ఒకరోజు వరుణ్ తేజ్ ను షూటింగ్ కి రమ్మని చెప్పి ఉంటే సరిపోయేది కదా అంటూ పెద్ద ఎత్తున చిరంజీవి లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆచార్య సినిమా ద్వారా కొన్ని సంవత్సరాలకు సరిపడా ట్రోలింగ్ సరిపడా స్టఫ్ అందించారని చెప్పాలి.
































