తెలంగాణలో 50 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి.. మంచి మనసంటూ నేటిజన్స్ కామెంట్?

0
237

Manchu Lakshmi: మంచు లక్ష్మి తన భాష ద్వారా నిత్యం ఎన్నో సార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా కేవలం భాష ద్వారా మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఫోటోలు కూడా పెద్ద ఎత్తున నేటిజన్ ల ట్రోలింగ్ గురవుతూ ఉంటాయి. నిత్యం ఇలాంటి నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొంటున్న మంచు లక్ష్మిపై తాజాగా నేటిజన్ లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే మంచు లక్ష్మి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటికే ఈమె టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం ద్వారా టీచర్స్ లేని పాఠశాలలలో విద్యార్థులకు చదువులు చెప్పిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొనసాగుతుంది.

 

ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం మనబడి మన ఊరు కార్యక్రమంలో భాగంగా ఈమె యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఏకంగా 50 పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు భువనగిరి కలెక్టరేట్ సమావేశంలో భాగంగా ఈ దత్తత ఒప్పందాన్ని స్వీకరించారు. ఈ క్రమంలోనే ఈ విషయాలను యాదాద్రి కలెక్టర్ అధికారికంగా వెల్లడించారు.

పాఠశాలలో మౌలిక వసతులతో పాటు పుస్తకాలు పంపిణీ..

మంచు లక్ష్మి దత్తత తీసుకున్న ఈ గవర్నమెంట్ పాఠశాలలలో ఒకటి నుంచి ఐదు తరగతిల వరకు విద్యార్థులకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ తరగతులను నిర్వహించడమే కాకుండా పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకు కావాల్సిన పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ఈమె టెక్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఈ మంచి కార్యానికి శ్రీకారం చుట్టడంతో పెద్ద ఎత్తున నేటిజన్ లు ఈమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.