సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలలో పాల్గొన్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి చిందులు వేస్తాము. లేదంటే ఇంట్లో ఎవరూ లేకపోతే అలా సరదాగా డాన్స్ వేయడం చేస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి చిందులు వేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సాంప్రదాయ నృత్యాలు అయినా భరతనాట్యం కూచిపూడి వంటి డాన్సులు చేయాలంటే ఎంతో శిక్షణ అవసరమవుతుంది. ఈ విధమైనటువంటి డాన్స్లు చేయాలంటే మహిళలు ఎంతో కష్టపడుతుంటారు.

ముఖ్యంగా భరతనాట్యం డ్రెస్ ధరించి ఇలాంటి డాన్స్ లు చేయాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇలాంటి నృత్యం చేయాలంటే ఎక్కువ శిక్షణ కూడా అవసరం అవుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం భరతనాట్యాన్ని ఎంతో అవలీలగా అది కూడా భరతనాట్యం డ్రెస్ ధరించి ఎంతో చాకచక్యంగా వేశారు. ప్రస్తుతం ఈ వ్యక్తి చేసిన భరతనాట్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ డాన్స్ చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి డాన్సర్ అని… భరతనాట్యం స్టెప్పులను ఎంతో అద్భుతంగా వేస్తున్నారని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలోని వ్యక్తి పైన చొక్కా ధరించి కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. సుశాంత్ నంద అనే ఐఎఫ్‌ఎస్ అధికారి తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరెందుకు ఆలస్యం ఆ అద్భుతమైన ప్రదర్శన పై మీరు ఓ లుక్కేయండి.





























