ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యపై నెటిజన్ల ట్రోల్స్.. ఏందుకంటే..

0
460

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మరియు వీళ్ల గారాల కుట్టీ ఆరాధ్య మాల్దీవుల నుండి ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం నుండి వారు నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాల్దీవులలో ఆరాధ్య పుట్టినరోజు ఘనంగా జరుపుకొని.. తిరిగి వచ్చేశారు. చాలా రోజుల తర్వాత తల్లీకూతుళ్లు జంటగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆ వీడియోలో ఆరాధ్య తన తల్లితో కలిసి ఉండటం, ఆమె చేతిని ఐశ్వర్య పట్టుకోవడం కనిపించింది. ఇక వీడియోపై, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య నడకలో ఎలాంటి మార్పు లేకపోగా.. తన కూతురు ఆరాద్య నడకపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆరాధ్య క్యాట్‌వాక్‌పై.. ఆరాధ్య నడకకు ఏమైంది అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేయగా ఇలా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ ఇది కేవలం సరదా కోసమే ఆరాద్య చేస్తుందని ఒకరు అన్నారు. ఈ వీడియోలో ఐశ్వర్య తన కూతురు చేయి పట్టుకోవడంతో.. ఆమె చేయిని వదిలి పెట్టండి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అదే సమయంలో అభిషేక్ ఆరాధ్య పోజులిచ్చిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. “పుట్టినరోజు శుభాకాంక్షలు యువరాణి’’ అంటూ ట్యాగ్ చేసి ఫొటోలను పోస్టు చేశాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అందే కాకుండా.. ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాడు..

“నిన్న ఆరాధ్య 10వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇవే కాకుండా అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య రిసార్ట్‌లోని సిబ్బందితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మా బస ఇంత సౌకర్యవంతంగా చేసినందుకు @amillafushi యొక్క సిబ్బంది మరియు నిర్వహణకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.