తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో మొదటి రాత్రే పెళ్లికొడుకు ఉరి వేసుకున్నాడు. పెళ్లి జరిగి 11 రోజులు కాగా వరుడు ఉరి వేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే మనిమద్దె గ్రామానికి చెందిన అంతమ్మ చిన్నకొడుకు సోమేష్ వయస్సు 27 సంవత్సరాలు. ఈ నెల 3వ తేదీన సోమేష్ కు ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహం జరిగింది.

మంగళవారం రాత్రి పెళ్లి జరిగి 11 రోజులు కావడంతో మొదటి రాత్రికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సోమేష్ కుటుంబ సభ్యులకు తన స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని కొంత సమయంలో తిరిగి వస్తానని చెప్పాడు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఎంతసేపటికీ సోమేష్ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమేష్ మొబైల్ కు ఫోన్ చేశారు.

అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోమేష్ ఫోన్ ను లిఫ్ట్ చేయలేదు. బయటకు వెళ్లిన సోమేష్ అతని స్నేహితులను కలిసిన అనంతరం ఇంటికి వెళుతున్నానని చెప్పి గ్రామంలోని పాడుబడ్డ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. రాత్రంతా కంగారు పడిన కుటుంబ సభ్యులు నిన్న ఉదయం ఊరంతా గాలించగా పాడుబడ్డ ఇంటిలో ఉరి వేసుకుని సోమేష్ కనిపించాడు. సోమేష్ చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రాథమికంగా పెళ్లి ఇష్టం లేకపోవడం వల్లే సోమేష్ చనిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసుల దర్యాప్తు తరువాతే సోమేష్ మృతికి సంబంధించి అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు సోమేష్ ఉరి వేసుకోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here