Niharika: నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి మనకు తెలిసిందే. పెళ్లైన రెండు సంవత్సరాలకి తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నానని నిహారిక సోషల్ మీడియా వేదికగా తన విడాకుల వార్తలను అధికారికంగా ప్రకటించారు. ఈ విధంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నిహారిక వెంకట చైతన్య మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని అందుకే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కూడా అప్లై చేశారని తెలియజేశారు. నిహారిక విడాకులు తీసుకుని విడిపోవడంతో తన భర్త నుంచి ఎంత మొత్తంలో భరణం అందుకున్నారన్న విషయాల గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
నిహారిక తన భర్త వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 100 కోట్ల రూపాయల భరణం అందుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. నిహారిక చైతన్య నుంచి ఏ విధమైనటువంటి భరణం అందుకోలేదని తెలుస్తోంది. ఈమె సోషల్ మీడియా వేదికగా తన విడాకుల గురించి తెలియజేస్తూ ఇద్దరం కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పుకొచ్చారు.

Niharika: నిహారిక భరణం తీసుకోలేదా…
ఇలా అంగీకారంతో విడిపోతున్న సమయంలో భరణం ఎందుకు చెల్లిస్తారు అంటూ కొందరు ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.మరి నిజంగానే నిహారిక వెంకట చైతన్య నుంచి భరణం అందుకోలేదా ఒకవేళ అందుకుంటే ఎంత మొత్తంలో తీసుకున్నారనే విషయాలు గురించి తెలియాలి అంటే ఈ వార్తలపై వెంకట చైతన్య లేదా నిహారిక స్పందించాల్సి ఉంది.































