నేను సినిమాల్లో నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిహారిక..!

0
155

మెగా డాటర్ నిహారిక కొణిదెల.. సినిమాల్లోనూ, వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆమె కొన్ని రోజుల కిందట వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నిర్మాతగా అవతరించి.. తన సత్తాను చాటుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

హీరోయిన్లకు పెళ్లైన తర్వాత కెరీర్ విషయంలో చేంజ్ లేదని.. దానికి ఉదాహరణగా సమంతను చెప్పారు. ఆమెకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెకు విపరీతంగా ఆఫర్లు వచ్చాయి. పెళ్లికి ముందు ఎంత డిమాండ్ ఉందో.. పెళ్లి తర్వాత కూడా అంతే ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఇక తనకు యాక్టర్ గా స్పూర్తి.. మెగస్టార్ చిరంజీవి అంటూ చెప్పారు. ఇక తాను సినిమాల్లో నటించలేకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. తన భర్త చైతన్యకు సినిమాల్లో నటించడం ఇష్టంలేదని.. అందుకే తాను సినిమాలో నటించడం లేదంటూ చెప్పారు. ఇక సినిమాలు కాకుండా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే తాను ‘టీచ్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమం ప్రారంభించానని.. అందులో పిల్లలకు పాఠాలు చెపుతున్నానని అన్నారు.

ఇన్ని చేసినా సినీ ఇండస్ట్రీపై ప్రేమ తగ్గకపోవడంతో.. ప్రొడక్షన్ మొదలు పెట్టానన్నారు. ఇటీవల జీ తెలుగులో వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ విడుదలై మంచి పేరు సంపాదించుకుంది.. ఆ సిరీస్ ప్రొడక్షన్ తానే చేసినట్లు చెప్పారు. అంతే కాకుండా నాన్న కూచీ, ముద్దపప్పు ఆవకాయ్ వంటి వెబ్ సిరీలను కూడా తీశానన్నారు. ఇక తర్వలో యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here