Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా పలు సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి ఈమె తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఎంతో ఘనంగా జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి నిహారిక పెళ్లయిన ఏడాదికి తన భర్తకు దూరంగా ఉంటున్నారు.

నిహారిక వెంకట చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తుంది.కానీ నిహారిక చైతన్య వ్యవహార శైలి చూస్తే మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని స్పష్టంగా అర్థమవుతుంది.ఇలా నిహారిక తన భర్తకు దూరంగా ఉన్నారని తెలియడంతో ఈమె రెండో పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ఈమె సాయి ధరంతేజ్ ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. తన అన్నయ్య వరుణ్ తేజ్ వివాహం పూర్తి కాగానే నిహారిక సాయి ధరంతేజ్ పెళ్లి జరుగుతుందంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక తన భర్త వెంకట చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ప్రముఖ యూట్యూబర్ అని తెలుస్తుంది.

Niharika: మెగా అల్లుడు కాబోతున్న యూట్యూబర్…
ప్రముఖ యూట్యూబ్ నిహారిక చాలా చనువుగా ఉండటమే విడాకులకు కారణమని తెలుస్తుంది. అయితే ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వడంతో తిరిగి ఆయనని రెండో వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనగా మారింది. అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి మెగా ఫాన్స్ ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.































