Niharika: మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈమె ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇస్తున్నానంటూ అధికారకంగా ప్రకటించారో అప్పటినుంచి నిహారికకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇక చివరికి నిహారిక ఈ వార్తలపై స్పందిస్తూ… చైతన్య తను పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే నిహారిక చైతన్యల వివాహం జరగడానికి ముందే ఓ మెగా హీరో తనతో కష్టం అంటూ హెచ్చరించారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
చైతన్య తండ్రి చిరంజీవి మంచి స్నేహితులు కావడంతో నిహారికను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరి వివాహం నిశ్చయమైన తర్వాత వరుణ్ తేజ్ చైతన్యతో మాట్లాడుతూ తన చెల్లిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టమని తన గోల భరించలేవు అంటూ తనకు చెప్పారట.

Niharika: అతిగారాభమే కారణమా…
ఇన్ని రోజులు నిహారిక అల్లరిని మేం భరించాము. ఇకపై నువ్వే భరించాల్సి ఉంటుంది. తనతో చాలా కష్టం బాగా అల్లరి చేస్తుంది. ఎలా భరిస్తావో ఏంటో అంటూ చైతన్యకు నిహారిక గురించి తెలియజేశారట.అయితే నిహారిక ఎంతో స్వేచ్ఛగా బ్రతికిన అమ్మాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇంట్లో తన మాటే నెగ్గాలని పంతం అలాగే తనని కూడా నాగబాబు అంతే గారాభంగా పెంచారు. ఆ గారాభమే తన జీవితానికి శాపంగా మారిందని తెలుస్తోంది.




























