ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన కేరళను మరో వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఇటీవల ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైద్య అధికారులతో సమావేశాలు నిర్వహించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.

అయితే ఇంతలా భయపెడుతున్న నిఫా వైరస్ కు.. కరోనా వైరస్ కు మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రెండేళ్ల కిందట ఈ నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే దీనిని 1999 మలేసియాలో సున్గాయ్ నిఫా అనే గ్రామంలో దీనిని గుర్తించారు. కావునా ఆ గ్రామం పేరు మీదనే నిఫా వైరస్ అనే పేరు పెట్టారు. అయితే పందులు, గబ్బిలాలు, మేకలు, పిల్లులు, గుర్రాలు, గొర్రెలు లాంటి జంతువులను ఈ వైరస్ హోస్ట్‌గా చేసుకుంటుంది.
ఇన్ఫెక్షన్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలను వెంటనే చూపదు. నిఫా వైరస్ అనేది జోనేటిక్ ఇన్ఫెక్షన్ కిందకు వస్తుంది. ఇక కరోనా వైరస్ అనేది పేరు ఇప్పటి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సార్స్ వ్యాధి అనేది అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఆ వ్యాధి కరోనా వైరస్ వల్ల వచ్చింది. దీంతో ఆ కరోనా పేరు అనేది మొదటి నుంచే ఉంది.
కానీ ఇటీవల చైనాలో వుహాన్‌లో కరోనా మరో రూపాంతరం చెంది కోవిడ్ 19 వైరస్ గా మొదటిసారి వెలుగుచూసింది. అప్పుడు కొన్ని నిర్ధారణ పరీక్షలు చేసి అది కరోనా వైరస్ గా గుర్తించారు. అయితే ఈ రెండింటికి ఎలాంటి మందు లేదు. కరోనా వైరస్ అంత వ్యాప్తి నిఫా వైరస్ కు లేదు. కావునా దీని యొక్క వ్యాప్తి కరోనాతో పొల్చితే తక్కువనే చెప్పాలి. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ నిఫాకు అది కూడా లేదు. దీంతో కేరళవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

































