Nithya Menen: నిత్యామీనన్ పెళ్లి వార్తల ద్వారా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే మలయాళీ నటుడితో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తన ప్రమేయం లేకుండా తన పెళ్లి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో నిత్యమీనన్ ఈ వార్తలపై స్పందించారు.

ఈ క్రమంలోనే తన ప్రమేయం లేకుండా తన పెళ్లి కూడా చేసేసారు అంటూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే నిత్యామీనన్ తాజాగా ఒక వీడియో ద్వారా తాను కొద్ది రోజులపాటు నటనకు దూరమవుతున్నానని వెల్లడించారు. అయితే ఈమె నటనకు దూరం కావడానికి గల కారణం కూడా తెలిపారు.

కొద్దిరోజుల పాటు యాక్టింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అంటే పెళ్లి చేసుకుంటున్నానని అర్థం కాదు. ప్రస్తుతం తాను నటించిన ఐదు ప్రాజెక్ట్స్ షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ కూడా సరైన సమయంలో షూటింగ్ పూర్తి అయ్యాయని అయితే ప్రస్తుతం తనకు కాస్త విరామం అవసరం అని అందుకే యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చానని నిత్యామీనన్ తెలిపారు.
విశ్రాంతి కోసం యాక్టింగ్ కు బ్రేక్…
గత కొద్దిరోజుల క్రితం నిత్యామీనన్ కాలికి దెబ్బ తగిలిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే నొప్పి నుంచి కాస్త ఉప్పుసమనం పొందాలని తను మెల్లిగా నడవగలుగుతున్నానని ఈ సమయంలోనే తనకు కాస్త విశ్రాంతి అవసరం అనిపించడంతో తాను కొద్దిరోజుల పాటు విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా నిత్యామీనన్ వెల్లడించారు. ఇక నా పెళ్లికి సంబంధించిన ఎలాంటి కాల్స్ రావని భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































