ఇండియాలో కరోనా అంతం అయ్యేది అప్పుడే: నిత్యానంద

0
263

గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే రెండవదశ కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేసింది. ఈ వైరస్ ధాటికి ప్రజలు చిగురుటాకులా వణికిపోతారు. ఇలాంటి సమయంలోనే ఈ వైరస్ నుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఎవరికి తోచిన రీతిలో వారు చెబుతున్నారు.అధికారులు అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని చెప్పగా,అదే డాక్టర్లను అడిగితే వ్యాధి తీవ్రతను బట్టి ఇన్ని రోజులలో ఈ నెలలో వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతుంటారు.

ఈ విధమైనటువంటి ఓ వింత ప్రశ్న ఓ నెటిజెన్ కి కలగడంతో ఈ ప్రశ్నను నెటిజన్ డాక్టర్ నో లేక అదికారులనో అడగకుండా డా ఎప్పుడు తనకు తాను ఎంతో గొప్ప అని తాను ఒక దేవుడు అని ఫీల్ అయిపోయే నిత్యానంద స్వామిని ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారనే కుతూహలం ఏర్పడటంతో ఆ నెటిజెన్ ఏకంగా నిత్యానంద స్వామిని ఈ ప్రశ్న అడిగారు.

ఈ క్రమంలోనే స్వామి ఇండియాలో కరోనా ఎప్పుడు పోతుంది అని అడగగా… దానికి వీడియో చాటింగ్ లో నిత్యానంద స్వామి చిరునవ్వు నవ్వి.. ఇండియాలో కరోనా వైరస్ ఎలా పోతుంది.. అది నేను ఇండియాలో కాలు పెట్టేవరకు పోదని.. తన శరీరంలోకి అమ్మా దేవి ప్రవేశించిందనిని త్యానంద స్వామి సమాధానం చెప్పడంతో ఈ సమాధానం విన్న నెటిజన్ల అందరూ ఎంతో షాక్ అయ్యారు.

లైంగిక వేధింపుల ఆరోపణల ఎన్నో కేసులు తనపై ఉండడంతో ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లి… అక్కడే కైలాసం అనే కింగ్ డమ్ ఏర్పాటు చేసుకున్న నిత్యానందస్వామి తరచు ఏదో ఒక వీడియో విడుదల చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో అతని వీడియోల పై నెటిజన్లు స్పందించి ఎన్నో విమర్శలు చేస్తుంటారు. ఈ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తనకు తానే దేవుడిగా భావిస్తుంటాడు నిత్యానంద స్వామి. తాజాగా కరోనా వైరస్ గురించి నిత్యానంద స్వామి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here