దేశవ్యాప్తంగా కరోనా దెబ్బతో మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం కొన్ని వెసులుబాటులను కల్పించింది. అందులో మందుబాబులకు కిక్కిచ్చే అంశం కూడా ఉంది. మే 4 నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్త విని మందుబాబులు అందరు సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం వీరి అసలు మీద నీళ్లు చల్లింది. రేపటి నుంచి మద్యం అమ్మకాలు జరిపేదిలేదని తేల్చి చెప్పారు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు. దీనితో ఉసూరు మంటున్నారు మందుబాబులు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్యంపై తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం. మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు రాష్ట్రంలో తెరవనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. వైన్ షాపులకు వచ్చే వారు తప్పని సరిగా సామజిక దూరం పాటించాలని, మాస్క్ లను ధరించాలని సూచించారు.
































