దేశంలో కరోనా రోజు రోజుకు పంజా విసురుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరమవుతుంది. మరో వైపు భాదితులను ముందుగా గుర్తించేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే క్రమంలో తెలంగాణ సర్కార్ మెడికల్ షాపులపై కొన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికీ ప్రిస్క్రిప్క్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దని సూచించింది. ఆ మందుల వల్ల వారికి స్వల్పకాల ఉపశమనం కలుగుతుండటంతో కొందరు పరీక్షలకు ముందుకు రావడంలేదనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై జలుబు, దగ్గు, జ్వరం మందులు అమ్మాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ చేసింది. మరోవైపు సాధారణ మందుల అమ్మకాలపై కూడా నియంత్రణ విధించింది. దగ్గు మందులు సైతం ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మడానికి కుదరదని ఆదేశాలు జారీచేసారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రెటరీ.. జిహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
