NTR 30: ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లోకి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. త్రిబుల్ ఆర్ ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీర్ ఇకపై తన స్థాయికి తగ్గట్టు పాన్ ఇండియా లెవెల్ లోకి సినిమాలు చేయటానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.

చాలా రోజుల క్రితం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమా చాలాకాలం వాయిదా పడుతూ వచ్చింది.
ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించనుంది. ఇప్పటికే విడుదల చేసిన జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజా ఎన్టీఆర్ 30 నుండి మరొక అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.
ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు. తాజాగా విలన్ సైఫ్ అలీఖాన్ కూడా హైదరాబాద్ చేరుకొని షూటింగ్ లో పాల్గొన్నాడు.అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఎన్టీఆర్ 30 లో విలన్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు సైఫ్ అలీఖాన్ షూటింగ్ స్పాట్ కి రావటంతో ఆ రుమర్స్ కి పుల్ స్టాప్ పెట్టేశారు.

NTR 30:ఎన్టీఆర్ తో పోటీకి సై అంటున్న సైఫ్..
బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా ఎలాంటి రోల్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్-సైఫ్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లుతెలుస్తోంది.2024 ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤????
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023































