NTR: పిల్లల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్… అసలేం జరిగిందంటే?

0
40

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మరి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ రామ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

అయితే ఎన్టీఆర్ మాత్రం తన కొడుకుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తన పిల్లలు ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈయన తన పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట.సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా ఉంటుంది. అయితే ఆ నెగెటివిటీ తన పిల్లల కెరియర్ పై ప్రభావం చూపుతోందని భావించారట.

NTR: సోషల్ మీడియాకు దూరం..


ఈ విధంగా తన పిల్లల కెరియర్ కి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విధంగా ఎన్టీఆర్ పిల్లల విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో సరైనదని అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.