వీడియో వైరల్: బుల్లితెరపై సందడి చేయనున్న ఇద్దరు స్టార్ హీరోలు.. విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమో!

0
353

బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న కార్యక్రమం “ఎవరు మీలో కోటీశ్వరుడు”. బుల్లితెరపై ఇదివరకే “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో కొన్ని సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా “ఎవరు మీలో కోటీశ్వరుడు” గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ కార్యక్రమంపై అంచనాలు పెంచాయి.

గత కొద్ది రోజుల నుంచి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ కు
సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలు ఇద్దరు స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఎంట్రీ ఇవ్వడం ప్రోమోకి హైలెట్ అయిందని చెప్పవచ్చు.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఒకే వేదికపై కనిపించడంతో ఈ కార్యక్రమం దద్దరిల్లిపోతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో రికార్డు స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రోమోలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తి కరంగా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఏది హాట్ సీట్, ఏది హోస్ట్ సీట్ తారక్ చెర్రీకి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు చెర్రీ దీర్ఘంగా ఆలోచిస్తూ సమాధానాలను తెలియజేస్తున్నారు.

ఈ విధంగా వీరిద్దరి మధ్య సాగిన మొదటి ఎపిసోడ్ ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే సందడి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.