Connect with us

Political News

ఓబిసి బిల్లుకు లోక్ సభ ఆమోదం!

Published

on

Advertisement

వెనుకబడిన తరగతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లుకు మద్దతుగా 385 మంది ఎంపీలు ఓటేశారు. రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

ఇక రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను సేకరించి, నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. ఓబీసీ, సామాజికంగా, వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం సైతం రాష్ట్రాలకు దక్కనుంది.

Advertisement

Featured

YS Jagan Mohan Reddy: జగన్ ని హత్య చేయడం కోసమే దాడి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్!

Published

on

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. విజయవాడలో ఈయన పట్ల గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయగా కంటి పై భాగంలో గాయం అయి కుట్లు కూడా పడ్డాయి అయితే ఈ దానికి పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేశారు.. ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు.

జగన్ పై రాయి విసిరినటువంటి వారిని గుర్తించినటువంటి పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే సతీష్ అనే యువకుడు జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే సతీశ్ ఒక్కడినే అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం.

సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడన్నారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలనే ఉద్దేశ్యం ఉందని రిమాండ్ రిపోర్టులో సతీష్ వెల్లడించారు. ఇలా పథకం ప్రకారమే ఈయన ప్లాన్ చేసి మరి జగన్ పై హత్య ప్రయత్నం చేశారని తెలుస్తుంది.

Advertisement

పదునైన కాంక్రీట్ రాయి..

అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు అయితే ఈయనే ప్లాన్ ప్రకారం ఇలా దాడి చేశారా లేక ఈయన వెనక ఎవరైనా ఉండి తనని నడిపిస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ ను అరెస్ట్ చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 వేముల సతీష్ కుమార్ ను ఏ2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు

Advertisement
Continue Reading

Featured

Ap politics: జగన్ పై దాడి.. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదా?

Published

on

Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్ర అద్భుతమైనటువంటి విజయం అందుకోవడంతో అది చూసి తట్టుకోలేనటువంటి ప్రతిపక్ష నేతలు ఈ దాడి చేయించారంటూ వైసిపి నేతలు కార్యకర్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిందంటే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఖండించాలి.అయితే టీడీపీ నాయకులు దాడిని ఖండించకుండా ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల జరిగినటువంటి ఈ భౌతిక దాడి కంటే ఆయన పట్ల ఆయన స్థాయిని దిగజార్చి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్లు ఎంతో బాధ కలిగిస్తున్నాయని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వారు ఈ ఘటనపై స్పందించి విచారం వ్యక్తం చేయగా చాలా ఆలస్యంగా చంద్రబాబు నాయుడు స్పందించడంతోనే ఆయన మనసులోని భావాలు ఏంటో అర్థం అవుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి పట్ల రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయనకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెబుతారని సోషల్ మీడియా వేదికగా వైసిపి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

గత ఫలితాలే రిపీట్ అవుతాయి..
చంద్రబాబు నాయుడు జైలులో ఉంటే ఆయనపై హత్య ప్రయత్నాలు చేస్తున్నారంటూ తన ఎల్లో మీడియాతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయించారు అయితే ఇప్పుడు కళ్ళముందే రక్తం కారుతూ ఉన్నా డ్రామాలు అంటూ తన పచ్చ మీడియాతో చెత్త రాతలు రాయిస్తున్నారని, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఆయన రాజకీయ పతనానికి కారణం అవుతాయని 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు కూడా రిపీట్ అవ్వబోతాయి అంటూ వైసిపి అభిమానులు హెచ్చరిస్తూ చేస్తున్నటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ap politics: సీఎం పట్ల జరిగిన దాడి పై మౌనం వహిస్తున్న పవన్.. సైలెన్స్ వెనుక అదే కారణమా?

Published

on

Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు రాయితో దాడి చేయక జగన్మోహన్ రెడ్డి కంటి పై తీవ్రమైనటువంటి గాయం అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరి చికిత్స చేయించుకోవడంతో కుట్లు పడ్డాయి వైద్యులు సలహాల మేరకు నేడు జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రకు విరామం ఇచ్చారు.

ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి పై జరిగినటువంటి ఈ దాడి కచ్చితంగా ప్రతిపక్ష నేతలే చేసే ఉంటారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి కానీ ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే వైసిపి వాళ్ళే చేసుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారు అని చెబుతున్నారే తప్ప ఎవరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ విచారణ చేపట్టాలని చెప్పలేదు దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదం నెలకొంది.

ఇక చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించి విచారణ జరపాలని కోరగా ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గాను లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు అయితే ఈయన ఇలా సైలెంట్ గా ఉండడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి పాజిటివ్ గా స్పందించినా నెగిటివ్ గా స్పందించినా సమస్యేనని ఫీలవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

పవన్ లో మార్పు అవసరం..
ఆ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ కు స్పందించే ఆలోచన అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబుపై జరిగిన దాడి విషయంలో గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు మాత్రం జగన్ విషయంలో మౌనంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఆయన రాజకీయ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయని తెలుస్తుంది. రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో మారాల్సి ఉంటుందని పలువురు పవన్ వ్యవహారం శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!