భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి మహిళలకు భద్రత లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.ఇకపోతే ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం బతికితే చాలు అని ఎంతోమంది భావిస్తున్న నేపథ్యంలో కూడా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు.సాధారణ మనుషుల విషయం పక్కనపెడితే ఏకంగా కరోనా బారినపడి, కరోనా చికిత్స తీసుకుంటున్న మహిళల పట్ల కూడా ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం చూస్తుంటే మన దేశంలో మహిళలకు భద్రత ఎంత ఉందో తెలిసిపోతుంది.

ఒడిశాలోని న్యూపాద జిల్లా. అది ఏప్రిల్ 26. ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతున్న బాధితులు అందరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ మహిళ కరోనా బారిన పడి ఆస్పత్రికి వచ్చింది. మిగతా పేషెంట్లు అందరూ యువతి పట్ల దీనంగా చూడగా రెండు కళ్ళు మాత్రం ఆమెను వక్రబుద్ధితో చూశాయి. అదే సమయంలోనే ఆ బాధితురాలు ఏదో పని నిమిత్తం ఒక గదిలోకి వెళ్ళగానే వెంటనే కరోనాతో బాధపడుతున్న మరొక మానవ మృగం ఆ గదిలోకి వెళ్ళాడు.
కొద్దిసేపటికి ఆ గదిలో నుంచి గట్టిగా కేకలు వినిపించడంతో మిగిలిన వారందరు వెళ్లి చూడగా లోపలినుంచి ఆ మహిళ కన్నీటితో బయటకు వచ్చి అసలు విషయం బయట పెట్టింది. దీంతో వళ్ళు మండిన సదరు పేషెంట్లు అతనిని చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఓ లేడీ తహసిల్దార్ ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకొని తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలపగా కేసు నమోదు చేసుకున్నారు.
న్యూపాద పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజుక్త బర్లా… అతనిపై IPC సెక్షన్ 354 (మహిళపై బలవంతపు దాడి), సెక్షన్ 354 (A), సెక్షన్ 269, సెక్షన్ 270 కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.అతనికి ప్రస్తుతం కరుణ పాజిటివ్ గా ఉండటం తో అతనికి నెగిటివ్ వచ్చిన తర్వాత రిమాండ్ కి తరలిస్తామని, ప్రస్తుతం అతనిని ఆ ఆస్పత్రి నుంచి పాలిటెక్నిక్ ట్యూన్డ్ కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.