Pawan Kalyan: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఒకప్పటి హోమ్లీ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇప్పటివరకు దృశ్యం సినిమాతో ప్రేక్షకులను సందడి చేసిన మీనా త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Shanmukh-Siri Hanmanthu: రెండు జంటలు విడిపోవడానికి కారణం అయిన బిగ్ బాస్..ఆ పాపం ఊరికే పోదు అంటూ..!
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఈమె పవన్ కళ్యాణ్ కి అక్క పాత్రలో నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ప్రకటించినప్పటికీ ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మే నెల నుంచి వరుస షూటింగ్లను జరుపుకోనున్నట్లు సమాచారం.































