ఇంట్లోనే కూర్చొని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు..! ఆన్‌లైన్ లో రవాణా సేవలు.

0
215

డిజిటలైజేషన్ లో భాగంగా కేంద్ర రవాణా శాఖ లెర్నర్ లైసెన్స్, లైసెన్స్ రేన్యువల్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి 18 రకాల సేవలను పూర్తిస్తాయిలో ఆన్‌లైన్ అందించింది. ఈ నేపధ్యంలో లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ లోనే మీ డ్రైవింగ్ లేన్సేన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  1. parivahan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
  2. అందులోని ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. ఆ మెనూ లో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఆప్షన్ ఎంచుకోండి
  4. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  5. తరువాత డేట్ ఆఫ్ బర్త్ , డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్ కోడ్ వివరాలు ఇవ్వండి.
  6. తర్వాత మీ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
  7. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఒక మెసేజ్ వస్తుంది.
  8. రెన్యూవల్ ఛార్జీని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అవుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here