Oscar 2023: ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు కూడా ఒకటి. మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ అవార్డు ప్రధానోత్సవం వేడుకల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారిగా తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవటం తెలుగు ప్రజలు గర్వంగా భావిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి ఎంపికయ్యింది. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమాలోని ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావాలని భారతీయ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన ట్రిపుల్ ఆర్ టీమ్‌కి…తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.

Oscar 2023: ఆశలన్నీ ఆస్కార్ పైనే…
అమెరికా మీడియాతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు . ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. అలాగే హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ సైతం అందుకుంది. ప్రపంచ సినీవేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని వెలుగెత్తి చాటాలంటూ.. ట్రిపుల్ టీమ్‌కు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు .


























