దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అతిత్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ కూడా ఒకటి.

అయితే ఈ వ్యాక్సిన్ ఒక నిండుప్రాణాన్ని బలిగొంది. బ్రెజిల్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మృతి చెందినట్టు నిన్న అధికారిక ప్రకటన చేసింది. బ్రెజిల్ తో పాటు ప్రపంచ దేశాల్లో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కొదీ రోజుల క్రితం ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక వ్యక్తి బ్రిటన్ లో అనారోగ్యానికి గురి కాగా క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం మరోసారి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మృతి చెందాడా..? ఆ వ్యక్తి మృతికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే వాలంటీర్ మృతి చెందినా క్లినికల్ ట్రయల్స్ ఆగవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడంతో ఆ వ్యాక్సిన్ ను తీసుకున్న ఇతర వాలంటీర్లు సైతం ఆందోళనకు గురవుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ ఈ ఘటన గురించి స్పందిస్తూ వ్యాక్సిన్ భద్రత గురించి అనుమానాలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. అయితే వాలంటీర్ మృతి చెందినంత మాత్రాన ప్రయోగాలు నిలిపివేయాల్సిన అవసరం ఐతే ప్రస్తుతానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here