Pallavi prashanth: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి పల్లవి ప్రశాంత్ ఒకరు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెళ్లి వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. పల్లవి ప్రశాంత్ బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా ఈ వార్తలపై ఇప్పటికే బరెలక్క స్పందించారు.

పల్లవి ప్రశాంత్ నాలాగే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అందుకే ఆయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను తనకు సపోర్ట్ చేశాను ఆయనను నాకు అన్నయ్యతో సమానం అంటూ ఈమె ఈ పెళ్లి వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించారు.
ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ తన గురించి శిరీష గురించి వస్తున్నటువంటి పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొందరు ఉద్దేశం పూర్వకంగానే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఆమె నా చెల్లితో సమానం ఒక అన్నయ్యగా తనకు జీవితాంతం తోడుగా ఉంటానని తనకు ఏ అవసరం వచ్చిన అన్నయ్యగా నా చెల్లిని ఆదుకుంటాను అంటూ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు.
అన్నయ్యగా తోడుంటా…
ఇక వీరిద్దరూ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఒకరు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి సెలబ్రెటీ హోదా సొంతం చేసుకోగా మరొకరు తెలంగాణ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు. ఈమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటి చేయడంతో అందరి ఆ టెన్షన్ ఈమె పైనే ఉంది ఈ ఎన్నికలలో ఈమె గెలవలేకపోయినా సెలబ్రెటీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.






























