ఉప్పెన సినిమాతో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతోనే తనకున్న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దీని తర్వాత అతడు వెంటనే ఒప్పుకున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ సినిమా.

దీనిని ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. దీనిని సన్నపురెడ్డి వెంట రామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ చిత్రంగా దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ఈ సినమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉండగా.. వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలోని ‘నీ కళ్లు నీలి సముద్రం’అనే సాంగ్ లో తాను చేసిన నటనకు మెచ్చి తనకు ఈ అవకాశాన్ని దర్శకుడు ఇచ్చాడని అన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కథను తాను మొదట విన్నానని.. దానిని తన మామ అయిన పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పానని.. అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తాను కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి వహిస్తున్నాడు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ కనిపించనున్నాడు. అడవికి వెళ్లి అక్కడ తన కుటుంబాన్ని , తన గొర్రెలను క్రూరమైన జంతువుల నుంచి ఎలా కపాడుతాడనేది ఈ సినిమా అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నాడు.































