Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా కృష్ణా మరణంతో సీనియర్ హీరోల శకం ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.ఇదిలా ఉండగా కృష్ణ గారితో పనిచేసినటువంటి సెలబ్రిటీలు రచయితలు దర్శకనిర్మాతలు ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ కృష్ణ గారి మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు.కృష్ణ గారు తనకు అడగకుండానే సహాయం చేశారని ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన తెలిపారు.
బంగారు భూమి సినిమా కోసం తాను నాలుగైదు డైలాగులు రాసానని ఇలా రాసినందుకే తన పేరుని మొదట్లో వేయించుకోమని చెప్పారు. కానీ నేను వద్దని చెప్పాను. ఇక ఈ సినిమాలో పద్మ మనిషిని నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతాడు.. అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది.ఆ మట్టికి నమస్కారం చేయి అనే డైలాగ్ విన్న తర్వాత కృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఉంది ఎవరు రాశారు అని అడిగారు అప్పుడు పి సి రెడ్డి గారు ఆ డైలాగ్ నేను రాసానని కృష్ణ గారికి చెప్పారు.

Paruchuri Gopala Krishna: గొప్ప రచయిత అవుతా అంటూ జోస్యం చెప్పారు…
ఈ డైలాగ్ విన్న అనంతరం నేను ఇండస్ట్రీలో పెద్ద రచయిత అవుతానని అప్పట్లోనే కృష్ణ గారు జోస్యం చెప్పారని పరుచూరి వెల్లడించారు.హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ ఎంతోమందికి సహాయ సహకారాలు చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో తన ఇంటి నిర్మాణానికి డబ్బు సహాయం చేశారని ఇలా కృష్ణగారు డబ్బు సహాయం చేయడంతోనే ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టానని, అదే మంచితనమే మహేష్ బాబుకు కూడా వచ్చింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


































