సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్య బారినపడి సర్జరీ చేయాలని వైద్యులు సూచిస్తే ఎంతో ఆందోళన చెందుతాము. అదేవిధంగా సర్జరీ చేస్తున్న సమయంలో మత్తు మందు ఇచ్చి సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు తీవ్ర భయాందోళనలు చెంది అధిక రక్తపోటు సమస్యకు గురవుతుంటారు. సాధారణ సర్జరీలు అనగానే ఎంతో ఆందోళన చెందుతారు. కొన్ని సర్జరీలు రోగికి ఎటువంటి మద్దతు ఇవ్వకుండా చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో బ్రెయిన్ సర్జరీ ఒకటి. బ్రెయిన్ సర్జరీ అంటే వైద్యులు కూడా ఎంతో అప్రమత్తమై, ఎంతో జాగ్రత్తగా సర్జరీని నిర్వహిస్తారు. కానీ ఇంగ్లాండ్‌లోని నాటింగ్హామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం బ్రెయిన్ సర్జరీ చేస్తున్నంతసేపు డాక్టర్లతో జోకులు వేస్తూ చేయించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇంగ్లాండ్‌లోని నాటింగ్హామ్‌కు చెందిన 30 సంవత్సరాల షానీ ఆంట్క్లిఫ్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు ఈక్రమంలోనే అతనికి ప్రిన్స్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే సర్జరీ చేస్తున్నంతసేపు మెలకువగా ఉండడం ఎంతో ముఖ్యమని అతనికి డాక్టర్లు సూచించారు. సర్జరీ చేయించుకోవడం కోసం మొదట్లో సంకోచించిన తరువాత సర్జరీ చేయించుకోవడం కోసం ఒప్పుకొన్నారు.
ఈ క్రమంలోనే సర్జరీ చేయించుకుంటున్న షానీ బ్రెయిన్ సర్జరీ చేస్తున్నంత సేపు స్పృహలో ఉండి డాక్టర్లతో ఎంతో సరదాగా జోకులు వేసుకుంటూ ఆపరేషన్ చేయించుకున్నారు.డాక్టర్లు సైతం అతని జోకులను వింటూ సుమారు గంటకు పైగా సర్జరీ నిర్వహించారు.అప్పటి వరకు అతను ఏమాత్రం స్పృహ కోల్పోకుండా ఎంతో ధైర్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదివరకే షానీ తరహాలోనే ఓ వ్యక్తి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ జరిగే వరకు వయోలిన్ వాయిస్తూ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు.






























