Pavitra Lokesh -Naresh: ఈ ఏడాది పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన వారిలో నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ ఒకరని చెప్పాలి.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇన్వాల్వ్ కావడంతో వీరి వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇకపోతే ఈ జంటగత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఈ విషయం గురించి నరేష్ పవిత్ర మాత్రం ఏ విధమైనటువంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే కొత్త సంవత్సరం కానుకగా ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు లిప్ లాక్ చేసుకున్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
ట్విట్టర్ వేదికగా నరేష్ ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరూ కేక్ కట్ చేసిన అనంతరం లిప్ కిస్ పెట్టుకున్నారు. అదేవిధంగా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు. అందుకు మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలని కోరుకున్నారు. ప్రస్తుతం నరేష్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pavitra Lokesh -Naresh: ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్…
ఇక వీరిద్దరూ పలు సినిమాలలో జంటగా నటించడంతో వీరి మధ్య ప్రేమ చిగురించిందని దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.అయితే ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక నటి పవిత్రతో ఈయనకు నాలుగవ పెళ్లి కావడం గమనార్హం.
New Year ✨
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
New Beginnings ????
Need all your blessings ????
From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
































