Pavitra Lokesh: పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా ఈ పేరు సోషల్ మీడియా వార్తలలో మారుమోగిపోయింది. ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలిచారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె నరేష్ తో తన రిలేషన్ కట్ చేసుకున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా గడుపుతున్న పవిత్ర లోకేష్ గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఇష్టమైన హీరోల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గతంలో ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తనకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం అని ఈమె తెలిపారు.
రజనీకాంత్ గారిని నేరుగా తను ఒకసారి మాత్రమే కలిశానని ఆయనతో అప్పుడు కలిసి దిగినటువంటి ఫోటో ఇప్పటికి నా దగ్గర చాలా భద్రంగా ఉందంటూ ఈమె తెలియజేశారు. గుప్తగామి అనే సీరియల్ లో నటిస్తున్న సమయంలో రజినీకాంత్ గారి క్లాస్మెట్ ఈ సీరియల్ హీరో. ఇలా సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రజనీకాంత్ గారు మారువేషంలో లొకేషన్ లోకి రాగా ఆ సమయంలో ఆయనతో కలిసి ఫోటో దిగానని తెలిపారు.
Pavitra Lokesh: నాగార్జున ఫస్ట్ క్రష్..

ఇక తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున గారు ఫస్ట్ క్రష్ అంటూ ఈ సందర్భంగా పవిత్ర తెలియజేశారు. నేనుఆరో తరగతిలో చదువుతున్న సమయంలో నాగార్జున నటించిన గీతాంజలి సినిమా విడుదలైంది అలా ఆ సినిమా చూడగానే ఆయన తన ఫస్ట్ క్రష్ అయ్యారు అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ నాగార్జున గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు నాగార్జున గారిని తాను రెండుసార్లు మాత్రమే కలిశానని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ వెల్లడించారు.

































