Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా శాండిల్ వుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో ఈమె పేరు మార్మోగిపోతుంది. పవిత్ర నరేష్ తో రిలేషన్ లో ఉన్నారని వార్తలు రావడంతో సీన్లోకి నరేష్ మూడో భార్య ఎంట్రీ ఇచ్చింది.ఇలా రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ విషయం కాస్త తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తలతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ నటుడు నరేష్ వార్తల్లో నిలిచారు. ఇకపోతే ఈ వయసులో కూడా ఎంతో గ్లామర్ గా ఎంతో ఫిట్నెస్ తో ఉండే పవిత్ర లోకేష్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన పవిత్ర లోకేష్ ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్ ను నియమించుకొని గంటల కొద్దీ వర్కౌట్స్ చేస్తూ శరీర ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారట. అదేవిధంగా ఎంతో స్లిమ్ గా కనిపించడం కోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే పవిత్ర హీరోయిన్ల రేంజ్ లో తన అందంపై దృష్టి పెట్టి లక్షల విలువ చేసే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ తన అందాన్ని కాపాడుకుంటున్నారట.

Pavitra Lokesh: అందం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న పవిత్ర…
ఈ విధంగా తనకన్నా వయసులో పెద్దవారు స్లిమ్ గా ఉండడంతో పవిత్ర కూడా ఏకంగా తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి అందాన్ని కాపాడుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గేదే అన్నట్టు పవిత్ర లోకేష్ అందాన్ని కాపాడుకోవడం కోసం ఇలా కోట్లు ఖర్చు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.































