Pavitra -Naresh: నటుడు నరేష్ పవిత్ర రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా వీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతారని వార్తలు వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగానే నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నరేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ తమ పెళ్లి వీడియోని షేర్ చేశారు.

ఈ సందర్భంగా నరేష్ తమ పెళ్లి వీడియోని షేర్ చేస్తూ ఒక పవిత్ర బంధం… రెండు మనసులు… మూడు ముళ్ళు… ఏడు అడుగులు కొత్త ప్రయాణం ప్రారంభించాం మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం అంటూ పెళ్లి వీడియోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజెన్స్ ఒకింత షాక్ అయ్యారు.
ఇలా నరేష్ పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక ట్విట్టర్ యూజర్ ఈ పెళ్లి వీడియో పై స్పందిస్తూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. పవిత్ర బంధం అంటూ ఈరోజు నటుడు నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నిజం కాదని అది ఇంకా పేరు పెట్టనీ ఓ సినిమా షూటింగ్లో భాగమని తెలిపారు.

Pavitra -Naresh:ఇన్ని ట్విస్టులు ఏంటి…
ఇకపోతే ఈ పెళ్లి తాజాగా జరిగినది కాదని ఇది రెండు నెలల క్రితమే షూట్ చేశారంటూ ట్విట్టర్ యూజర్ వీరి పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ అసలు ఏం జరుగుతుంది నరేషా…. నీ పెళ్లిలో ఇన్ని ట్విస్టులు ఏంటి మాకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి వీడియోతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
పవిత్ర బంధం అంటూ ట్విట్టర్ లో పెళ్లి వీడియో పోస్ట్ చేసిన @ItsActorNaresh
రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నరేష్.
ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమా కి సంబంధించింది.
సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఎమ్ ఎస్ రాజు https://t.co/SN8qYlpSEk— HEMA NIDADHANA (@Hema_Journo) March 10, 2023
































