దీపావళి పండుగ సందర్భంగా సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.దేశవ్యాప్తంగా జనాలు ఈ దీపావళి పండుగను నిన్న ఘనంగా జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాణాసంచాలను కాలుస్తూ ఈ పండుగను జరుపుకున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

పలువురు సెలబ్రిటీలు అయితే వారి స్టైల్ లో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి పండుగకు మహేష్ అభిమానులు, పవన్ అభిమానులు ఆనందించే సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ కి దీపావళి గిఫ్ట్స్ పంపించారు.
అవును మీరు విన్నది నిజమే స్వయంగా పవన్ కళ్యాణ్, అన్నాలెజినోవా దంపతులు మహేష్ బాబు ఫ్యామిలీకి దీపావళి కానుకలు పంపారు. పవన్ పంపిన గిఫ్ట్స్ లో స్వీట్స్, టపాకాయలు లాంటివి ఉన్నాయి.ఇక ఇదే విషయాన్ని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. థాంక్యూ అన్నా, పవన్ అని కామెంట్ పెట్టారు.ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో పవన్, మహేష్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. వారిద్దరి మధ్య ఇంతటి మంచి విశేషం జరిగితే ఇరు హీరోల అభిమానులకు పండగ అనీ చెప్పవచ్చు.అలాగే దర్శకుడు హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి లకు కూడా పవన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలతో కానుకలు పంపారు. పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రంలో నటించబోతున్నారు.. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.































