Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ఓ క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిన సినిమాలలో తొలిప్రేమ ఒకటి.పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి కావడంతో తిరిగి ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఈనెల 30వ తేదీ ఎంతో ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నిర్మాత జి వి జి రాజు, పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఈయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారు కానీ ఎంత తీసుకున్నారనే విషయాన్ని తాను చెప్పనని వెల్లడించారు.సినిమా ఓకే అయిన తర్వాత కొంత మొత్తంలో అడ్వాన్స్ గా ఇచ్చి తిరిగి సినిమా విడుదలైన తర్వాత మిగిలినది మొత్తం పూర్తి చేస్తానని చెప్పాను. అయితే పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పారు.

Pawan Kalyan: ఖర్చులకోసం నెల నెల తీసుకున్నారు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ నెల నెల కొంచెం మొత్తం తన ఖర్చులకోసం ఇవ్వమని చెప్పగా నిర్మాత కూడా అలాగే ఇచ్చారని ఇక మిగిలినది మొత్తం సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత పూర్తి చేశామని ఈ సందర్భంగా నిర్మాత జివిజి రాజు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలియచేసినప్పటికీ ఎంత తీసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


































