Pawan Kalyan: సంక్రాంతికి వస్తుందని అనుకున్నా ‘‘భీమ్లా నాయక్’’ సినిమా వాయిదా పడటం పవన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. వకీల్ సాబ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘‘అయ్యప్పనుమ్ కోషియుమ్’’ సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ వస్తుంది.

సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో సినిమా రూపొందింది. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే రాజమౌళి, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సంక్రాంతి బరిలో నిలవడంతో భీమ్లా నాయక్ సైడ్ అయిపోయింది.

అయితే భీమ్లా నాయక్ విడుదలకు ట్రిపుల్ ఆర్ కారణమైందని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ కూడా వాయిదా పడటం ఆడియన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. ఇక భీమ్లా నాయక్ వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ వెకేషన్స్ కి వెళ్ళాడు. తాజాగా తిరిగి వచ్చిన క్రమంలో ఎయిర్ పోర్ట్ లో దిగిన పవన్ లుక్ వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసి ట్విట్టర్ లో..
అక్కడే ఉన్న ఓ అభిమాని పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసి ట్విట్టర్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ టీ షర్ట్ జీన్స్ ధరించాడు. ఇక వెకేషన్ విషయానికి వస్తే భీమ్లా నాయక్ వాయిదా పడటంతో రష్యాలో విహారయాత్రకు వెళ్ళాడు. పవన్ తో పాటు ఆయన భార్య అన్నా లెజ్నేవా, పిల్లలతో టైం స్పెండ్ చేశాడు. అక్కడే కుటుంబంతో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయడంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని కొన్ని రాష్ట్రాలు ఆదేశించాయి. దీంతో ప్యాన్ ఇండియా సినిమాలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి.































