Pawan Kalyan: బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఉపవాసం ఉన్నారు… సముద్ర ఖని కామెంట్స్ వైరల్!

0
38

Pawan Kalyan: సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేడు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా డైరెక్టర్ నటుడు సముద్రఖని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా కథ చెప్పగానే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు అని అడిగారు.

మీరు రేపే అంటే ఈ సినిమా రేపే స్టార్ట్ అవుతుందని చెప్పడంతో కథ విన్న తర్వాత మూడు రోజులకు సినిమా షూటింగ్ పనులు ప్రారంభించామని సముద్రఖని వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ సమయం వృధా కాకుండా లొకేషన్ లోనే కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేసుకున్నారని తెలిపారు. ఎక్కడ సమయం వృధా కాకుండా పవన్ కళ్యాణ్ చకచకా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.

Pawan Kalyan: ఉపవాసంతోనే షూటింగ్ పూర్తి చేశారు…


ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ దేవుడి పాత్రలో నటించే రోజులన్నీ కూడా ఉపవాసంతోనే నటించారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి సముద్రఖని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి