Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అదానీ జగన్ ముడుపుల వ్యవహారం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అదానీ పై అమెరికాలో కూడా కేసులు నమోదు కావడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనగా మారింది.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిల్క్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల రూపాయలు విరాళంగా అందుకున్నారు. అయితే అదానీ పట్ల కేసులో నమోదు కావడంతో ఆయన తీసుకున్నటువంటి ఆ వంద కోట్ల రూపాయలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక తాజాగా జగన్ అదానీ ముడుపుల వ్యవహారం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు.
గత ప్రభుత్వం ఏపీలో చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం మేము వాటిని సరిదిద్దాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ఇక జగన్ అదానీ విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించిందని కేవలం సమోసాల కోసమే 9 కోట్ల వరకు ఖర్చు చేసింది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Pawan Kalyan: సమోసాలకు తొమ్మిది కోట్లు..
ఇక వైకాపా నాయకులు మాత్రం అదానీ వ్యవహారం గురించి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందంపై చేసుకున్న దాని కంటే చాలా తక్కువ ధరతో మేము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, ఒకవేళ అక్రమంగానే జగన్ ముడుపులు తీసుకొని ఉంటే ఎందుకు ఇప్పటివరకు సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు ఇందులో జగన్ చేసిన తప్పులేదు కనకే కూటమి నేతలు మౌనంగా ఉన్నారని కౌంటర్ ఇస్తున్నారు.
































