Pawan Kalyan: నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.పవన్ కళ్యాణ్ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతో ఉన్నప్పటికీ ఈయన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో వివాహం చేసుకున్నారు. ఇక ఈయన రెండవ వివాహాన్ని తన సహనటి రేణు దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమెతో పెళ్లికి ముందే సహజీవనం చేసిన పవన్ కళ్యాణ్ తనకు కుమారుడు జన్మించిన తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు.

ఇకపోతే అనంతరం వీరికి కూతురు జన్మించిన తర్వాత ఇద్దరు కొన్ని సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ అకీరా, ఆధ్యా మెగా కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తుంటారు.ఇదిలా ఉండగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మరోసారి వార్తల్లో నిలిచిన పవన్…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైసీపీ అధికార నేత నాగార్జున యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గతంలో అఖీరాకు తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయంలో తాను ఏమాత్రం అబద్ధం చెప్పడం లేదని ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే
2007 సెప్టెంబర్ 5వ తేదీ OP 590/ 2007 పిటీషన్ నంబర్‌ను చూడండి. పవన్ కళ్యాణ్‌ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో లివింగ్ రిలేషన్ ద్వారా కొడుకు పుట్టారా అని ప్రశ్నించగా అకీరాతో తనకు సంబంధం లేదని పవన్ చెప్పినట్లు ఈయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































