Pavan Kalyan : పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాలతో విడిపోయారు ఇక వారి ప్రేమా గుర్తుగా పుట్టినరోజు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య. రేణు దేశాయ్, పవన్ విడిపోయాక పిల్లలు ఇద్దరు రేణు దేశాయ్ తోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు పవన్ వద్దకు వస్తుంటారు. ఇక పవన్ తనయుడు అకీరా సినిమా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు.

ఈ మధ్యనే అకీరా పవన్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి అధికారిక ప్రకటన ఇంకా చిత్ర యూనిట్ నుండి ఈ విషయం గురించి వెలువడలేదు. అయితే అకీరా కత్తిసాము దృశ్యాలు సోషల్ మీడియాను ఉపేశాయి. ఇక అకీరా గురించిన ఆ విషయాన్నైనా పవన్ అభిమానులు బాగా ఫాలో అవుతుంటారు.
అవసరమున్నవాళ్ళకి ఇచ్చే అత్యంత విలువైనది రక్త దానం….
ఇక ఇపుడు అకీరా తన 18వ పుట్టినరోజు సందర్బంగా మొదటి సారిగా రక్తదానం చేసాడు. ఇక ఈ విషయాన్నీ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫొటోలతో షేర్ చేసింది. అవసరం ఉన్న వాళ్ళకీ మనం చేసే అత్యంత విలువైన సాయం రక్తం దానం చేయడం అని రేణు దేశాయ్ చెప్పారు. ఇక ఈ ఫోటోలను పవన్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అచ్చం తండ్రి లాగానే కొడుకు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక అకీరా కు పవన్ క చాలా విషయాల్లో పొంతన ఉంది. పవన్ లాగానే అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లను నేర్చుకుంటున్నాడు.































