Perni Nani : ఏపీ రాజకీయాల్లో టీడీపీ మీద ఎంత ఎత్తున వైసీపీ నేతలు లేస్తారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాత్రం వైసీపీ నేతల విసుర్లు బాగా ఉంటాయి. ఇంక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా లేక బహిరంగ సభ పెట్టినా ఆయన మాట్లాడిన విషయాలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ లో కొంతంది లీడర్స్ రెడీగా ఉంటారు. అందులో ముందుండేది పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని జనసేన అధినేత మీద బాగా ఫైర్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ మీద ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా అలా విమర్శలు చేయడమే పని అన్నట్లు చేసే పేర్ని నాని గారు అదే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురవగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

వేడి చల్లారాక వడ్డీస్తే ఏం లాభం…
పవన్ కళ్యాణ్ ఏదైనా సభ పెట్టినా మీడియాతో మాట్లాడినా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలను ఎక్కుపెడతారు. ఇక పవన్ మాట్లాడింది అయ్యేలోపే వైసీపీ నుండి లీడర్స్ కౌంటర్ కు సిద్ధమై పోతారు. ఇక ఇదే విషయం గురించి పేర్ని నాని ని ప్రశ్నించగా పవన్ చెప్పే అపద్దాలను తిప్పికొట్టేందుకు వెంటనే మాట్లాడాల్సి వస్తుందని వివరించారు.

భోజనం వేడిగా వడ్డీస్తేనే రుచి ఉంటుంది అలాగే తాను మాట్లాడిన అసత్యాలకు వేడిగానే కౌంటర్లు వేస్తేనే బాగుంటుంది అంటూ వివరించారు. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడితే నేను రెండు మెట్లు దిగి మాట్లాడాల్సి వస్తుంది. నేనెపుడూ నా జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడను అంటూ కానీ పవన్ కళ్యాణ్ మొదట నా గురించి విమర్శించాడు అందుకే నేను విమర్శించాల్సి వచ్చింది అంటూ చెప్పారు పేర్ని నాని.