వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..?

0
133

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత వ్యక్తిగత వాహనాలపై ప్రయాణం చేసే వారి సంఖ్య భారీగా పెరగగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పైపైకి ఎగిసిపడుతూ ఉండటం గమనార్హం. రోజువారీ ధరల సవరణ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ పెట్రోల్ ధర ముంబై తరువాత స్థానంలో ఉండగా డీజిల్ ధర దేశంలోనే అత్యధికం కావడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89.15 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 82.80 రూపాయలకు చేరడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర 2.10 రూపాయలు పెరగగా లీటర్ డీజిల్ ధర 2.20 రూపాయలు పెరగడం గమనార్హం. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరల వల్ల వాహనదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పవచ్చు. పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని విధిస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను విధిస్తూ ఉండటం గమనార్హం. ధరలలో పెట్రోల్ పై 57 శాతం, డీజిల్ పై 44 శాతం పన్నులు ఉంటాయని తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో అక్టోబర్ 4వ తేదీన పెట్రోల్ ధర 89.11 రూపాయలతో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 89.15 రూపాయలకు చేరి ఆ రికార్డులను బ్రేక్ చెసిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో
పెట్రోల్ ధర 100 రూపాయలకు, డీజిల్ ధర 90 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వాహనదారులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here