కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి సంవత్సరం దేశంలో అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు ఉపయోగపడుతోంది. అయితే కేంద్రం రైతులకు మరో తీపికబురు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రం ప్రస్తుతం 6,000 రూపాయలు జమ చేస్తుండగా ఇకపై 10,000 రూపాయలు జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
రాబోయే బడ్జెట్ లో కేంద్రం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ 2021 సంవత్సరంలో మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశెపెడుతుందో అని దేశంలోని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును 10,000 రూపాయలకు పెంచితే మాత్రం రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. రోజురోజుకు రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. కొన్ని పంటలకు మంచి దిగుబడి వస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదు. దేశంలోని చాలామంది రైతులకు పీఎం కిసాన్ నగదు సాయం కొంతమేర ఉపయోగపడుతోంది.
బడ్జెట్ పై ప్రజల్లో భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందో చూడాల్సి ఉంది. నివేదికలు సైతం పీఎం కిసాన్ నగదును పెంచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి. పీఎం కిసాన్ నగదును నిజంగా పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.