”రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం” పేరును క్రేంద్ర ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పురుస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పేరుతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచింది. క్రీడా పురస్కారం పేరుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.

ఇక క్రీడా విభాగానికి చెందిన ఈ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారికి రూ.25 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తారు. ఈ అవార్డును మొదటిసారి చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌కు అందజేశారు. ఇప్పటివనకు ఈ అవార్డు అందుకున్న క్రీడాకారులను ఓ సారి చూస్తే.. సచిన్ టెండూల్కర్, ధన్‌రాజ్ పిళ్ళై, పుల్లెల గోపీచంద్, అభినవ్ భింద్రా, లియాండర్ పేస్,అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్‌కు ఈ పురస్కారాన్ని పొందారు.


































