ప్రేమకు, ఆకర్శణకు తేడా తెలియని వయస్సు వీరిద్దరిది. ఒకరు మైనర్, మరొకరు మేజర్ కానీ వీరిద్దరి మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. వయస్సులో రెండేళ్ల పెద్ద అయిన ఆ యువతి అతడి ప్రేమలో పడింది. ప్రేమిస్తున్నానంటూ చెప్పింది. కానీ చివరకు ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. అది కేరళలోని పొల్లాచి. అక్కడ ఓ పెట్రోల్ బంక్ లో 19 ఏళ్ల ఓ యువతి పనిచేస్తుంది.

అక్కడకు ఎంతో మంది బంక్ లో పెట్రోల్ కోసం వచ్చి వెళ్తుంటారు. కానీ ఓ 17 ఏళ్ల మైనర్ మాత్రం అక్కడకు వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడమే కాకుండా.. ఆమె వంక ఒక రకంగా చూస్తూ ఉండేవాడు. ఇలా వాళ్ల మధ్య చూపులతోనే రెండు నెలలు గడిచింది. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు కూడా లేకుండానే ఇలా చూపులతోనే ఒకరినొకరు ఇష్టపుడుతున్నట్లు ఊహించుకున్నారు. ఓ రోజు అతడి కోసం ఎదురు చూస్తున్న సదరు యువతి.. సాయంత్రం వరకు అతడు బంక్ వద్దకు రాలేదు.
ఏమైందా అంటూ ఆరా తీయగా.. అతడికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుసుకుంది. వెంటనే వెళ్లి అతడిన చూసి.. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ.. పలకరించింది. తర్వాత అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఇద్దరు గుడికి వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత ఈ విషయం ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులకు తెలవడంతో ఆగ్రహించారు. కనీసం మైనర్ కూడా తీరకుండా.. పెళ్లి ఏంట్రా అని వాళ్లు మందలించారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతిని స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె అంతకు ముందే కోయంబత్తూరు లో కూడా మరో యువకుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా.. ఆ సమయంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అతడు మైనర్ తీరే వరకు వేచి చూస్తానని.. అతడే తన భర్త అంటూ పోలీసులకు చెప్పింది ఆ యువతి.
































