Pooja Hedge: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత మరో సినిమా రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో సినిమా మరో లెవెల్ లో ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ ఉండటం వల్ల ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించిన ఇలా వరుస వాయిదాలతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఇకపోతే ఈ సినిమా నుంచి నటి పూజా హెగ్డే తప్పకున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ విషయం పై పూజా హెగ్డే టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడటం వల్ల పూజా హెగ్డే కమిట్ అయిన ఇతర సినిమాలకు డేట్స్ ఏ మాత్రం అడ్జస్ట్ కావడంలేదని అందుకే తాను ఈ సినిమా షూటింగ్ నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు.

Pooja Hedge: మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల…
ఈ విధంగా గుంటూరు కారం సినిమా నుంచి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి శ్రీలీలా లక్కీ ఛాన్స్ కొట్టేసారని ఈమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేయగా ఈ వీడియో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసింది.
































